వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయం భారత విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Tri-Valley University
వాషింగ్టన్: భారత ప్రభుత్వ ఒత్తిడికి అమెరికా తలొగ్గింది. కాలిఫోర్నియాలోని ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం మూసివేత వల్ల నష్టపోయిన భారత విద్యార్థుల కోసం అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ప్రవాస వ్యవహారాల మంత్రిత్వ శాఖను నేరుగా సంప్రందించడానికి ఇ మెయిల్ అడ్రస్, వాయిస్ మెయిల్ ఇచ్చినట్లు ఐసిఇ అధికార ప్రతనిధి లారీ కె. హేలీ చెప్పారు. విద్యార్థులు 415 - 844-5320 అనే నెంబర్‌కు ఫోన్ చేయవచ్చునని లేదా వాయిస్ మెసేజ్ ఇవ్వవచ్చునని హేలీ చెప్పారు. ఐసిఇ ప్రతినిధి తిరిగి ఫోన్ చేస్తారని చెప్పారు. '[email protected]' అనే మెయిల్‌కు కూడా తమ ఫిర్యాదులను రాయవచ్చునని తెలిపారు.

ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో 1,555 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 95 శాతం మంది భారతీయులే, వారిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. వీసా నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై విశ్వవిద్యాలయాన్ని మూసివేశారు. ఐసిఇ ఆ విశ్వవిద్యాలయానికి షేమ్ యూనివర్సిటీ అని పేరు పెట్టింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X