పార్టీ నేతలతో చిరంజీవి భేటీ: కాంగ్రెసులో విలీనమా, పొత్తా?

వెంటనే విలీనానికి సిద్ధపడకూడదని సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. క్రమంగా విలీనం దిశగా సాగాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీకి నాలుగు మంత్రి పదవులు ఇస్తామని కాంగ్రెసు అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది. చిరంజీవి ఈ నెల 9వ తేదీన ఢిల్లీకి వెళ్లి 10వ తేదీన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాను కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. సమావేశానంతరం తిరుపతిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుపతి రచ్చబండ కార్యక్రమాల్లో చిరంజీవి ఫ్లెక్సీలు విరివిగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications