రాష్టపతి పదవి ఇవ్వలేదని సోనియాపై వ్యాఖ్యలు: కాకాపై డి. శ్రీనివాస్

D Srinivas
హైదరాబాద్: వ్యక్తిగత కారణాల వల్లనే తమ పార్టీ సీనియర్ నేత జి. వెంకటస్వామి (కాకా) తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే కాకా సోనియాపై వ్యాఖ్యలున చేసి ఉంటారని ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు వల్లనే తాను, తన కుటుంబ సభ్యులు ఎదిగారనే విషయాన్ని కాకా మర్చిపోయారని ఆయన అన్నారు. సోనియాపై నీచాతినీచంగా వెంకటస్వామి మాట్లాడారని ఆయన అన్నారు. కాకా చేసిన ప్రతి వ్యాఖ్యనూ తాను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రతిపక్ష నాయకుడు ఎల్‌కె అద్వానీ వంటి నేత కూడా సోనియాను భారత ప్రజలు స్వీకరించారనే విషయాన్ని గుర్తించారని, కాకా మాత్రం విదేశీ పౌరసత్వం గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పార్టీకి అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో అందరూ బతిలాడితే సోనియా పార్టీ పగ్గాలు చేపట్టారని, అలా బతిలాడినవారిలో కాకా కూడా ఉన్నారని ఆయన అన్నారు. సోనియా నాయకత్వం స్వీకరించిన తర్వాత బలం పెరిగిందని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఇంటికి ఎకె ఆంటోనీ వెళ్లడం సమంజసమేనని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇంటికి తాను, గులాం నబీ అజాద్ వెళ్లామని, తమతో పాటు కాకా కూడా వచ్చారని ఆయన అన్నారు. ఇక్కడ ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది సమస్య కాదని, కాంగ్రెసు పార్టీ తన మిత్రపక్షాలను ఎలా మర్యాదగా చూస్తోందో తెలుస్తుందని ఆయన అన్నారు. అవినీతికి సోనియా ఆమడ దూరమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+