బెంగళూర్ ఎన్‌కౌంటర్‌లో హైదరాబాద్ రౌడీషీటర్ నాగిరెడ్డి హతం

Nagireddy
బెంగళూరు: బెంగళూర్‌లోని రామ్మూర్తినగర్‌లో హైదరాబాదుకు చెందిన రౌడీషీటర్ పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. పక్కా సమాచారంతో పోలీసులు నాగిరెడ్డి కారును వెంబడించినట్లు, ఆ సమయంలో నాగిరెడ్డి పోలీసుల పైకి కాల్పులు జరిపినట్లు, పోలీసులు ఎదురు కాల్పులు జరిపినట్లు, ఈ ఎదురుకాల్పుల్లో నాగిరెడ్డి హతమైనట్లు తెలుస్తోంది. నాగిరెడ్డిపై ఆరు హత్య కేసులున్నాయి.

కర్ణాటకలో నాగిరెడ్డిపై ఐదు హత్య కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ హత్య కేసు నమోదై ఉంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసులో కూడా నాగిరెడ్డి నిందితుడు. నాగిరెడ్డిని గతంలో అరెస్టు చేసి బెల్గాం జైల్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతను యుకెకు పారిపోయాడని సమాచారం. యుకె నుంచి తిరిగి వచ్చిన నాగిరెడ్డి బెంగళూర్‌లో సంచరిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకుని వేటాడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+