నాసిక్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ కూలి ఇద్దరు దుర్మరణం
National
oi-Pratapreddy
By Pratap
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఓ సైనిక హెలికాప్టర్ కూలిపోయింది. బుధవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతులిద్దరు కూడా ఆర్మీ మేజర్స్. ప్రమాదం జరిగిన స్థలంలో ఆర్మీ ఏవియేషన్ శిక్షణా పాఠశాల ఉంది.
ప్రమాదానికి గురైన చీటా హెలికాప్టర్ నాసిక్ నుంచి గోవాకు బయలుదేరింది. నాసిక్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే హెలికాప్టర్ బుధవారం ఉదయం 9 గంటల 15 నిమిషాలకు కూలిపోయింది.