• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

భార్య ప్రియుడి ఇంటి ముందు భర్త ధర్నా, భార్యతో పెళ్లికి డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews
Anantapur
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తన భార్యను పెళ్లి చేసుకోవాలంటూ ఓ భర్త తన భార్య ప్రియుడి ఇంటి ముందు శుక్రవారం ఆందోళనకు దిగాడు. తన బంధువులతో కలిసి ధనంజయ్ అనే యువకుడు తన భార్య ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. అయితే భార్య ప్రియుడు పరారీలో ఉన్నాడు. పవిత్ర అనే యువతి పెళ్లికి ముందే గోపీ అనే యువకుడిని ప్రేమించింది. అయితే పెద్దలు ఒత్తిడి చేసి పవిత్రను ఆమె మేనమామ ధనంజయకి ఇచ్చి పెళ్లి చేశారు.

పెళ్లి తర్వాత పట్టు వదలకుండా గోపీ తన ప్రియురాలు పవిత్రకు ఫోన్లు చేస్తూ తన వద్దకు వచ్చేయాలని పట్టుబడుతూ వచ్చాడు. దీంతో పవిత్ర ప్రియుడి ఇంటికి వచ్చింది. అయితే అతను ఇంట్లో లేడు. దీంతో ధనంజయ గోపి ఇంటి వద్దకు వచ్చి ధర్నాకు దిగాడు. తన భార్య పవిత్రను పెళ్లి చేసుకోవాలని గోపీని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగాడు. భర్త దూరమై, ప్రియుడు మాయమై పవిత్ర తల్లడిల్లుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X