• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చిరంజీవికి మెగా షాక్: తెలుగుదేశంలోకి పీలేరు రామచంద్రారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews
Chandrababu Naidu
హైదరాబాద్: చిత్తూరు జిల్లా పీలేరు శాసనసభా నియోజకవర్గానికి చెందిన రామచంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు పార్టీలో విలీనం కాబోతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రామచంద్రారెడ్డిని తమ పార్టీలో చేర్చుకునే విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పీలేరు నియోజకవర్గం నాయకులతో చర్చించారు.

కాగా, తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు ఇంటిలోనూ సంస్థల్లోనూ ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో చంద్రబాబు పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. నామా ఇంటిలోనూ సంస్థల్లోనూ ఐటి సోదాలపై ఆయన సమావేశంలో చర్చించారు. ఐటి సోదాలను చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పరిగణిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
Desktop Bottom Promotion