మార్చి 7న జగన్ కొత్త పార్టీ: ముహూర్తం నిర్ణయించిన పండితులు

అయితే తాను కాంగ్రెసు పార్టీనుండి బయటకు వచ్చిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని పేరు పెట్టుకుంటే కాంగ్రెసు పార్టీ పేరు ఉపయోగించికున్నట్లు అవుతుందని, కాంగ్రెసు పార్టీని చీల్చి తాను పార్టీ పెట్టుకున్నట్లు అవుతుందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా ఆయన వైయస్సార్ పార్టీ పేరువైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం వైయస్సార్ పార్టీ పేరు పెండింగ్‌లో ఉంది. ఈ కారణంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే కడప, పులివెందులలో ఒకే గుర్తుతో పోటీ చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించిన జగన్ కూడా ఇప్పటికే ఆమోదమైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
జగన్ తన పార్టీ పేరును ఇడుపులపాయలో ప్రకటిస్తారు. దానిని గతంలో జగన్ వర్గం కూడా చెప్పింది. ఇడుపులపాయలో భారీ బహిరంగసభ మధ్య జగన్ పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరుతో ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నప్పటికీ వైయస్సార్ పార్టీ ఆమోదం పొందిన తర్వాత జగన్ పార్టీ పేరునుండి కాంగ్రెసును తీసివేయడానికే మొగ్గు చూపుతారని తెలుస్తోంది. మొదట మార్చి 3 లేదా 4 తేదీలలో ప్రకటించుదామని అనుకున్నప్పటికీ పండితులు సూచించిన మేరకు జగన్ మార్చి 7వ తేదిన పార్టీ ప్రకటిస్తున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications