చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలి: జెసి దివాకర్ రెడ్డి అభిమతం
State
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: కేంద్రంలో కన్నా రాష్ట్ర రాజకీయాల్లోనే చిరంజీవి ఉండాలని కాంగ్రెస్ మాజీమంత్రి జె.సి.దివాకర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. ఒక శుభలేఖ ఇచ్చేందుకు శుక్రవారం చిరంజీవి నివాసానికొచ్చిన ఆయన భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి రాజ్యసభకు వెళ్లి, కేంద్ర మంత్రి పదవి అధిష్టిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో ప్రజారాజ్యం పార్టీ విలీనం వార్తలపై రెండు పార్టీల్లోనూ హర్షం వ్యక్తమవుతోందని తెలిపారు. కాంగ్రెస్‌లో చిరు సేవలు అందించాలని తాను కోరినట్లు చెప్పారు. 2014 నాటికి కాంగ్రెస్ తరఫున చిరంజీవి సీఎం అభ్యర్థి అవుతారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా - కాంగ్రెస్‌లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చని అన్నారు.