17 నుంచి సహాయ నిరాకరణ, తెలంగాణ సాధిస్తాం: కోదండరామ్

తమ సహాయ నిరాకరణ ఉద్యమం శాంతియుత పద్ధతుల్లోనే ఉంటుందని, అయితే ప్రభుత్వమే హింసకు పాల్పడుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరిస్తోందని, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల బంద్‌కు తాము ఈ రోజు పిలువునిస్తే నిన్నటి నుంచే అరెస్టులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రజలను దూరం పెట్టి ముఖ్యమంత్రి పోలీసుల మధ్య రచ్చబండ నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నట్లే తెలంగాణ రాష్ట సాధనకు జరిగే ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొంటాయని, తెలంగాణ సాధించి తీరుతామని ఆయన అన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి తెలంగాణలోని అన్ని వర్గాలు సమాయత్తమవుతున్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications