• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కుటుంబమే నన్ను ఒంటరి చేసింది: ఎన్టీఆర్ విగ్రహంపై పురంధేశ్వరి

By Pratap
|
Google Oneindia TeluguNews
Purandeswari
విశాఖపట్నం: పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనపై తన కుటుంబ సభ్యులే తనను ఒంటరి చేశారని కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. తన సంతకం లేకుండానే లోకసభ స్పీకర్ మీరా కుమార్‌కు లేఖను సమర్పించారని ఆమె చెప్పారు. శనివారం విశాఖపట్నంలో ఆమె ఆ విధంగా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యవహార శైలిపైనే ఆమె ఆ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.

పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం తొలి నుంచి పోరాటం చేసింది తానేనని ఆమె చెప్పుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపనకు తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నానని ఆమె చెప్పారు. విదేశాల్లోని భారతీయుల నల్ల ధనాన్ని వెనక్కి తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X