పాక్ అధ్యక్షుడు జర్దారీ రహస్యంగా ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నారా?

Asif Ali Zardari
ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అమెరికాకు చెందిన తన్వీర్ అనే వైద్యురాలిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇస్లామాబాద్ ఆ వార్తలను ఖండించినప్పటికీ ప్రచారం ఆగడం లేదు. తన భార్య పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో చనిపోయిన తర్వాత జర్దారీ తన్వీర్‌కు దగ్గరైనట్లు చెబుతున్నారు. ఈ దంపతులు తమ సంబంధాన్ని జర్దారీ పదవీకాలం ముగిసే సమయంలో 2013లో బహిరంగంగా వెల్లడిస్తారని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో - చైర్మన్‌గా ఉన్న 22 ఏళ్ల జర్దారీ కుమారుడు బిల్వాల్ భుట్టో - జర్దారీ తండ్రి రాజకీయ వారసత్వాన్ని స్వీకరిస్తారని చెబుతున్నారు.

పెళ్లి వార్తలపై అడగ్గా - వ్యక్తిగత విషయాలకు ఏ మాత్రం ప్రాధాన్యం ఉండదని, ఈజిప్టు పరిస్థితిని చక్కదిద్దాల్సి ఉందని, పాకిస్తాన్‌లో ధరలను అదుపు చేయాల్సి ఉందని, పిపిపి నాయకుడిగా బిల్వాల్‌ను ముందుకు తేవాల్సి ఉందని జర్దారీ ఆ పాకిస్తానీ దినపత్రిక ది న్యూస్‌తో అన్నారు. జర్దారీ పెళ్లి చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అధ్యక్షుడి అధికార ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+