కాంగ్రెస్ చిన్న రాష్ట్రాలకు అనుకూలం కాదు, మీడియా సృష్టి: కోటగిరి

కాంగ్రెస్-ప్రజారాజ్యం పార్టీ పొత్తుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. విలీనానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దానిని ఆమోదించవలసి ఉంటుందన్నారు. విలీనంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. అందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. పార్టీలో ఉండి అన్ని ప్రతిఫలాలు పొందిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదన్నారు.
కాగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో చిరంజీవి భేటీ వాయిదా పడింది. ఉదయం భేటీ మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications