మార్పు కోసం మారిపోయా, ఇక కాంగ్రెస్ బలోపేతం చేద్దాం: చిరంజీవి

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి మద్దతు ఇస్తానని సోనియా హామీ ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్‌లో విలీనం అయినంత మాత్రాన ప్రజలకు దూరం కానని అన్నారు. విలీనం స్వలాభం కోసం కాదని చెప్పారు. గత ఎన్నికల్లో బిసిలకు ప్రాధాన్యం ఇచ్చి 104 సీట్లు కేటాయించిన ఘనత పీఆర్పీదే అన్నారు. ఇకనుండి కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసమే కాంగ్రెస్‌లో చేరినట్టు తెలిపారు. నాకు స్వాగతం పలికేందుకు వచ్చిన మిమ్మలను చూస్తుంటే నాకు అందరూ అండగా ఉన్నారనే నమ్మకం కలిగిందన్నారు.












Click it and Unblock the Notifications