విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి వ్యాఖ్యలు సమంజసం కాదు: బిజెపి నేత వెంకయ్యనాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
విజయవాడ: భారతీయ జనతా పార్టీపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఖండించారు. రాష్ట్రంలో బిజెపికి మనుగడ లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అనడం సమంజసం కాదన్నారు. జాతీయ స్థాయిలో బిజెపి కాంగ్రెసు‌కు మంచి ప్రత్యామ్నాయంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో సైతం బిజెపి కాంగ్రెసు, టిడిపిలకు ప్రత్యామ్నాయం కానుందని అన్నారు. చిరంజీవి వ్యాఖ్యలు సరికావన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెసు బలం తగ్గిపోయినందు వల్లనే చిరంజీవికి చెందిన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకుందని ఆరోపించారు. కాంగ్రెసు మునిగి పోయే నావ వంటిదన్నారు. చిరంజీవి మునుగుతున్న నావలో ఎక్కారని అన్నారు. కాంగ్రెసు వ్యతిరేక పార్టీలలో జాతీయ స్థాయిలో బిజెపికి మాత్రమే మంచి పేరున్నదని అన్నారు.

English summary
BJP senior leader Venkaiah Naidu condemned PRP president Chiranjeevi comments. Venkaiah said BJP is only the alternative to Congress in National level. He also said that, Congress invited merger of PRP due to government crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X