ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌కు జగన్ వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ సవాల్

జగన్ నన్ను బెదిరింపులకు, ఒత్తిళ్లకు గురిచేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మేం ఎవరి ఒత్తిళ్లకు లొంగమన్నారు. జగన్ ఒత్తిళ్లకు లొంగి మేం ఆయన వెంట వెళ్లడం లేదన్నారు. మా మనస్సాక్షి చెప్పినట్టే మేం నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఎండి రాధాకృష్ణ గురించి అందరికీ తెలుసునని, కానీ తాను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించాలని అనుకోవడం లేదని చెప్పారు. అయితే ఎబిఎన్ ఛానల్ తనపై చేసిన వార్తలు వాస్తవాలేనని నిరూపించడానికి సిద్ధపడితే వరంగల్ వదిలి వెళ్లడమే కాకుండా రాజకీయాలకు స్వస్తీ పలుకుతానని, నిరూపించకుంటే వారు ఛానల్‌ను మూసేసుకుంటారా అని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications