కొండా సురేఖకు వ్యాఖ్యల వెనుక వైయస్ జగన్ సాక్షి: శంకర రావు

P Shankar Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే కొండా సురేఖకు మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా సాక్షి అని మంత్రి శంకరరావు గురువారం ఆరోపించారు. కొండా సురేఖకు మతిభ్రమించిందన్నారు. ఆమెకు మానసిక చికిత్స అవసరమని చెప్పారు. సురేఖ చరిత్ర అందరికీ తెలుసని కొత్తగా చెప్పవలసిన పని లేదన్నారు. భారతదేశంలో ఎవరూ సురేఖ మాటలను సమర్థించరన్నారు. ఆమె వ్యాఖ్యలు తీవ్రాతితీవ్రం అన్నారు.జగన్ అన్ని కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు తెలియజేయాలన్నారు. కోట్లు ఎలా సంపాదించవచ్చునో సలహా ఇస్తే అందరూ కోటీశ్వర్లు అవుతారని చెప్పారు. ఆయన తన మంత్రదండాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఇస్తే బావుంటుందని అన్నారు.

జగన్ ఆస్తులపై అందరికీ అనుమానాలున్నాయని చెప్పారు. 2004కు ముందు 15 లక్షలు పన్ను కట్టిన జగన్ 2010లో 84 కోట్లు ముందస్తుగా కట్టారన్నారు. అవి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదన్నారు. జగన్ వైయస్ఆర్ పేరుతో పార్టీ పెట్టుకుంటే మంచిదన్నారు. నేను ప్రజల మనిషినని శంకర రావు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో తెలంగాణకు సంబంధం లేదన్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెసు అని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+