ట్రై వ్యాలీ తెలుగు విద్యార్థులకు ఊరట, ప్రత్యామ్నాయాలకు ఓకే

భవిష్యత్తులో అమెరికాలో చదువుకోవాలన్నా నిషేధం లేని విధంగా ప్రస్తుతానికి దేశం విడిచివెళ్లే అవకాశాల గురించి కూడా వివరిస్తారని తెలిపింది. ట్రైవ్యాలీ వర్సిటీ పలు దేశాల విద్యార్థులకు అక్రమంగా వీసాలు ఇప్పించినట్లు ఐసీఈ దర్యాప్తులో వెల్లడయింది. విద్యార్థులందరూ కాలిఫోర్నియాలో ఉన్నట్లు అధికార పత్రాల్లో చూపించినప్పటికీ వారిలో చాలా మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు కూడా విచారణలో వెల్లడయింది. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థుల కాళ్లకు పోలీసులు రేడియో కాలర్లు అమర్చడంతో పాటు, ఇంకా పలువురుని నిర్బంధంలోకి తీసుకున్నారు. వర్సిటీ పాల్పడిన అక్రమాలకు విద్యార్థులను దోషులుగా చేయడం అమానవీయమని భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి న్యాయం చేస్తామని అక్కడి అధికారులు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications