హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వనరులు లేని తెలంగాణ ఎందుకు: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: తెలంగాణకు చెందిన వనరులను నాశనం చేస్తే ఊరుకునేది లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం అన్నారు. ప్రభుత్వం, కొందరు అక్రమార్కులు కలిసి తెలంగాణలోని వనరులను అన్నింటిని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అయితే వనరులన్నింటీని కోల్పోయిన తెలంగాణను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. తెలంగాణ వనరులన్నింటినీ కొల్లగొడితుంటే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. వనరులతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పారు. వనరులు కోల్పోయాక తెలంగాణ ఏర్పడి ఏం లాభం అని ప్రశ్నించారు.

తెలంగాణకు చెందిన వనరుల్ని, ఆస్తులను కాపాడటానికి ఇకనుండి ఉద్యమిస్తామని నారాయణ స్పష్టం చేశారు. సర్కారు భూముల వేలం అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తెలంగాణలోని భూముల వేలాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పారు.

English summary
CPI state secretary Narayana accused government on Telangana resources. He said that people did not urged for Telangana without resources. He also said we will fight to protect Telangana resources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X