ఎడిసన్ 164వ జన్మదినాన్ని గుర్తు చేసిన గూగుల్ డూడుల్

థామస్ అల్వా ఎడిసన్ వంటి పలు ప్రముఖులను ప్రతి ఏటా గూగుల్ డూడుల్‌పై ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా వారు సాధించిన ఘతనతలు గుర్తు చేస్తుంది. ఇందులో భాగంగానే... శుక్రవారం, ఫిబ్రవరి 11న థామస్ అల్వా ఎడిసన్ 164వ జన్మదినాన్ని కూడా గూగుల్ గుర్తుచేయడం జరిగింది. ఈ గూగుల్ డూడుల్‌పై ఎడిసన్ కనుగొన్న ఎలక్ట్రిక్ బల్బు, ఫోనోగ్రాఫ్, కినెటోస్కోప్‌లను ప్రదర్శించారు. ఈ డూడుల్‌ను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇందులో దాగున్న GOOGLE అనే ఆంగ్ల అక్షరాలు పరికరాల రూపంలో కనిపిస్తాయి. ఇదే గూగుల్ డూడుల్ ప్రత్యేకత.
థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో 1847లో జన్మించారు. ఈయన తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్, తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్. ఎడిసన్ చిన్నతనంలో ఓ వార పత్రిక (వీక్లీ పేపర్)కు "పేపర్ బాయ్"గా పనిచేశారు. తర్వాతి కాలంలో టెలిగ్రాఫ్ ఆపరేటర్‌గా పనిచేశారు. 1877లో ఎడిసన్ ఫోనోగ్రాఫ్‌ను కనుగొన్నారు. దీంతో ఆయనకు "మెన్లో పార్క్ మాంత్రికుడు" అనే పేరు వచ్చింది. ఎడిసన్ కనుగొన్న పరికరాలలో ప్రొజెక్టర్, మోషన్ పిక్చర్ కెమరా వంటి దాదాపు 1093 పరికరాలు ఉన్నాయి. 1931లో ఎడిసన్ 84 ఏట అమెరికాలోని వెస్ట్ ఆరెంజ్‌లో కన్నుమూశారు.
థామస్ అల్వా ఎడిసన్ భౌతికంగా మరణించినప్పటికీ వెలుగుతున్న బల్బు ఎల్లప్పుడూ ఆయనను గుర్తు చేస్తూనే ఉంటుంది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications