తెలంగాణపై ఆలస్యం చేస్తే క్రెడిట్ విపక్షాలకు పోతుంది: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar
కరీంనగర్: తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తే క్రెడిట్ ప్రతిపక్షాలకు పోతుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రతరం కాకముందే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కేంద్రాన్ని కోరారు. సమ్మెలు, సహాయ నిరాకరణ ఉధృతం కాకముందే తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైమ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల బోధనా ఫీజులను వెంటనే విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కిరణ్ కుమార్ రెడ్డి 12 సార్లు పోటీ చేసి 9 సార్లు గెలిచారని, అందువల్ల బోధనా ఫీజులపై ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+