హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేలను పిలవడం లేదు: పోస్టర్ విడుదలలో భూమన

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆరిపోతున్న దీపం అని మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై ఈ నెల 18వ తారీఖున జగన్ చేయనున్న నిరాహార దీక్ష పోస్టర్‌ ఫీజుపోరును భూమన కరుణాకర్ రెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫీజుపోరుకు వేలాదిగా విద్యార్థులు తరలి వస్తారని చెప్పారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వంపై పోరు చేస్తున్నామన్నారు. జగన్ వెంట వస్తున్న ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఈ విషయంపై చర్చిస్తారని చెప్పారు.

జగన్ ఎమ్మెల్యేలను ఎవరినీ పిలవడం లేదన్నారు. వారే స్వచ్చంధంగా వస్తున్నారని చెప్పారు. డిఎల్ రవీంద్రారెడ్డి జగన్‌పై చేస్తున్న కామెంట్లను ఆయన కొట్టి పారేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మరన్నారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 18వ తారీఖున ఉదయం 11 గంటలకు జగన్ ఇందిరాపార్కు వద్ద దీక్షకు కూర్చుంటారని చెప్పారు.

English summary
Ex MP YS Jagan camp senior leader Bhumana Karunakar Reddy said Jagan is not inviting MLAs to participate in his 
 
 programmes. Bhumana blamed TDP president Chandrababu and Minister DL Ravindra Reddy for commenting against 
 
 YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X