తెరాసను విలీనం చేయిస్తారా?: కాంగ్రెసు హైకమాండ్ షరతు

తెలంగాణలో తాము తిరిగే పరిస్థితి లేదని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే తాము ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉండదని, ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, సహాయ నిరాకరణ ఉద్యమం వల్ల తాము మరింతగా ఇక్కట్ల పాలవుతామని, తమ సమస్యను గుర్తించి తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలని కాంగ్రెసు తెలంగాణ ప్రతినిధులు మొర పెట్టుకుంటున్నారు. రాజీనామాలు చేయాలని తమపై ఒత్తిడి పెరుగుతోందని వారు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఢిల్లీలోనే మకాం వేసే సూచనలున్నాయి. తెరాసను విలీనం చేయిస్తారా అని అధిష్టానం పెద్దలు వేస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక వారు సతమతమవుతున్నారు.












Click it and Unblock the Notifications