హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రి బంగళాను తనఖా పెట్టండి: దేవేందర్ గౌడ్ ఆగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Devender Goud
హైదరాబాద్: విద్యార్థుల బోధనా ఫీజుల చెల్లింపు కోసం అవసరమైతే ముఖ్యమంత్రి బంగళాలను, సచివాలయాన్ని, అసెంబ్లీని తనఖా పెట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. బోధనా ఫీజుల చెల్లింపులకు బిసి, ఎస్సీ కార్పోరేషన్ల ఆస్తులను తనఖా పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేశారు. కార్పోరేషన్లకు నిధులు కూడా లేవని, వాటిని ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే 17 కార్పోరేషన్లను, ఫెడరేషన్లను ఎత్తేసిందని ఆయన అన్నారు. ఇప్పుడు బిసీలు, ఎస్సీలకు చెందిన వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పూనుకుందని ఆయన అన్నారు.

బోధనా ఫీజుల చెల్లింపులకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవనే వాదనను ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వాదాయం వేల కోట్ల రూపాయలు పెరిగిందని, అయినా బోధనా ఫీజుల చెల్లింపులకు డబ్బులు లేవని వాదించడం సరైంది కాదని ఆయన అన్నారు. అది ప్రభుత్వ పెత్తందారీ విధానానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వాణిజ్య ప్రకటనల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం బడుగుల ఫీజులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. బిసిల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

English summary
TDP leader T Devender Goud lashes out at Government attitude towards release of fee reimbursement amount. He criticised that Government is behaving partisan attitude in implementing BC welfare measures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X