ఆటోను ఢీకొన్న లారీ: ఐదుగురు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు
Districts
oi-Srinivas
By Srinivas
మెదక్: జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ఐబీ బంగ్లా దగ్గర మంగళవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఐబీ బంగ్లా దగ్గర మూలమలుపు వద్ద వెళుతున్న ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు కాగా, 1 బాలుడు ఉన్నారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి ఆందోనకరంగా ఉంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
కాగా మంగళవారం ఒక్కరోజు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 16 మంది చనిపోయారు. అనంతపురం, అదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ప్రమాదం కారణంగా పలువురు మరణించారు.
Five people dead in an accident at IB Bangla, Alladurgam of Medak district. A lorry collided an auto at IB Bangla cross. Six injured in this accident. they sent to hospital.