కెసిఆర్‌పై వేలు పడితే హుస్సేన్ సాగర్‌లో ఎత్తి వేస్తాం: హరీష్ రావు
Districts
oi-Srinivas G
By Srinivas
కరీంనగర్: పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావును ఎత్తి పడేస్తామన్న నరసారావుపేట పార్లమెంటు సభ్యుడు వేణుగోపాలరావు వ్యాఖ్యలపై టిఆర్ఎస్ సిద్దిపేట శాసనసభ్యుడు టి.హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్‌ను ఎత్తి పడేసేందుకు ఆయన 50 కిలోల వ్యక్తి కాదని 56 ఏళ్ల ఉద్యమ శక్తి అన్నారు. వేణుగోపాలరావు అయినా, మరే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అయినా కెసిఆర్‌పై వేలు పెడితే హైదరాబాద్‌లో ఉన్న హుస్సేన్ సాగర్‌లో ఎత్తి పడేస్తామని హెచ్చరించారు.
వేణుగోపాలరావు పార్లమెంటు సభ్యుడిలా కాకుండా గూండాలా మాట్లాడుతున్నారన్నారు. కెసిఆర్ ఓ ఉద్యమశక్తి అని వారు తెలుసుకోవాలన్నారు.
TRS senior leader, Siddipet MLA T.Harish Rao condemned Narasaraopet MP Venugopal Reddy comments on KCR. He said that KCR is not a single person, he is Telangana power. Harish warned them they will through seemandhra MPs, if they will touch KCR.