8,690 కి. మీ వేగంతో చంద్రుడిని ఢీ కొట్టిన శకలం- వింత వెలుగులు, వాయువులు: ఆ తర్వాతే

అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఓ అరుదైన ఖగోళ ఘట్టానికి చందమామ వేదిక అయింది. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్ గతంలో ప్రయోగించిన ఫాల్కన్ 9 అప్పర్ స్టేజ్ చంద్రుడిని అత్యంత బలంగా ఢీ కొట్టింది. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 5వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోనుంది. చంద్రుడి ఉపరితలాన్ని తాకే సమయంలో ఈ రాకెట్ వేగం.. గంటకు దాదాపు 8,690 కిలోమీటర్లు పైమాటే. ఇది.. భూమిపై ప్రయాణించే ధ్వని వేగం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.

దాదాపు ఏడాది కాలానికి పైగా అంతరిక్షంలో భూమి- చంద్రుడి కక్ష్యల మధ్య ఈ ఫాల్కన్ 9 రాకెట్ శకలం పరిభ్రమిస్తూ వచ్చింది. దీని బరువు 4,899 కిలోలు. ఇంత బరువు ఉన్న ఓ రాకెట్ అప్పర్ స్టేజ్.. నియంత్రణ కోల్పోయింది. అత్యంత వేగంగా భూమి- చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. తాజాగా ఇది.. చంద్రుడి పశ్చిమ అంచున ఉండే ఐన్‌స్టీన్ క్రేటర్ సమీపంలో ఇది క్రాష్ అయింది. చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొన్నప్పుడు దాదాపు 3,000 కిలోల ప్రమాదకరమైన టీఎన్‌టీ పేలుడుకు సమానమైన శక్తి ఉత్పన్నమైనట్లు నాసా అంచనా వేసింది.

Unplanned Falcon 9 Lunar Collision Einstein Crater Illuminated by Dust Flash Sodium Lithium Gases

ఖగోళ శాస్త్ర చరిత్రలో చంద్రుడి వెలుతురు ఉండే భాగంలో ఇలాంటి మానవ నిర్మిత వస్తువు ఢీకొనడం గానీ, దానికి సంబంధించిన కాంతిని పరిశీలించడం గానీ ఇప్పటివరకు నమోదు కాలేదు. ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. అంతరిక్షంలో ఉండే తీవ్ర రేడియేషన్, సౌర గాలులు, గురుత్వాకర్షణ శక్తుల ప్రభావం వల్ల ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ తాకిడి కారణంగా చంద్రుడి ఉపరితలం నుండి భారీగా ఎగిసిన దుమ్ము, ధూళి మేఘాలను చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన టెలిస్కోప్ చిత్రీకరించింది.

చంద్రుడిపై హ్యూజ్ క్రాష్- ఇక ఉండేది 5 రోజులు మాత్రమే..!!
చంద్రుడిపై హ్యూజ్ క్రాష్- ఇక ఉండేది 5 రోజులు మాత్రమే..!!

చంద్రుడిని రాకెట్ శకలం ఢీకొట్టిన వెంటనే అక్కడ ఓ వింత కాంతి వెలువడింది. ఆ వెంటనే ఏర్పడిన ధూళి మేఘాలపై స్పెక్ట్రోస్కోపీ పరీక్షలు నిర్వహించారు.. చీలీ సైంటిస్టులు. అందులో సోడియం, లిథియం వంటి వాయువుల ఉనికిని గుర్తించారు. ఈ సోడియం వాయువులు చంద్రుడి నేల నుండి ఆవిర్భవించగా.. లిథియం మాత్రం ఫాల్కన్ 9 రాకెట్ లో ఉపయోగించిన పరికరాలు, ఇంధన అవశేషాల నుంచి వెలువడి ఉంటుందని ప్రాథమికంగా నిర్ణయించారు.

నేడే అంతరిక్షంలోకి విక్రమ్ 1 ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్: అరుదైన డైమండ్ లోటస్
నేడే అంతరిక్షంలోకి విక్రమ్ 1 ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్: అరుదైన డైమండ్ లోటస్

చంద్రుడిపై రాకెట్ శకలం పడటం అనేది ముందుగా రూపొందించుకున్న ప్లాన్ కాదు. ఇది అన్ ప్లాన్డ్ ప్రోగ్రామ్. ప్రయోగం ముగిసిన తర్వాత అంతరిక్షంలో ఉండిపోయిన ఫాల్కన్ 9 రాకెట్ శకలం.. సూర్యుడి నుండి వెలువడిన తీవ్ర సౌర గాలులు, గురుత్వాకర్షణ శక్తుల ప్రభావం వల్ల క్రమంగా తన కక్ష్యను కోల్పోయింది. వీటి వల్లే ఈ శకలం చంద్రుడి వైపు 9,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిందని స్పేస్ ఎక్స్ ప్రతినిధి జూలియానా స్కీమాన్ వెల్లడించారు.

ఈ తాకిడి వల్ల చంద్రుడికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదని అంచనా వేశారు. దీనిపై చేపట్టబోయే పరిశోధనల ద్వారా లభించే విలువైన సమాచారం భవిష్యత్తులో మానవాళి చేపట్టబోయే చంద్రమండల యాత్రలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని, భవిష్యత్ వ్యోమనౌకలు చంద్రుడిపై క్షేమంగా ల్యాండ్ కావడానికి, అక్కడ శాశ్వత స్థావరాల నిర్మాణాలను చేపట్టడానికి ఇది ఉపయోగపడుతుందని చీలీ సైంటిస్టులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+