చిరంజీవికి మరో షాక్: చంద్రబాబుతో కడప జిల్లా ప్రజారాజ్యం నేతల భేటీ

Prajarajyam
కడప: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి మరో షాక్ తగిలింది. చిరంజీవి నిర్ణయంపై తీవ్ర అసంతృప్తికి గురైన ప్రజారాజ్యం పార్టీ నేతలు ఒక్కరొక్కరే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అటు వైయస్ జగన్ వైపో, ఇటు తెలుగుదేశం పార్టీ వైపో వెళ్లేందుకు సిద్ధపడ్డారు. తాజాగా, మాజీ మంత్రులు, ప్రజారాజ్యం పార్టీ నాయకులు ఖలీల్ పాషా, బ్రహ్మయ్య మంగళవారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.

వారిద్దరిని చంద్రబాబు తమ పార్టీలోకి ఆహ్వానించారు. వారు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రూ ప్రజారాజ్యం పార్టీ నుంచి తప్పుకుని పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ప్రజారాజ్యం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాస్ కూడా వైయస్ జగన్ వర్గంలో చేరడానికి సిద్ధపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+