కుటుంబ సభ్యులతో జగన్ భేటీ: కొత్త పార్టీ, ఉప ఎన్నికలపై చర్చ!

రెండు చోట్ల నలుగురు అభ్యర్థులు ఒకే కుటుంబ సభ్యులు కాబట్టి తమకు మద్దతు ఇవ్వవల్సిందిగా కుటుంబ సభ్యులతో గతంలోనే సమావేశమై కోరారు. అప్పుడు మద్దతు కోరిన జగన్ తాజాగా తాను ఉప ఎన్నికలకుముందు మార్చిలో ప్రకటించబోయే పార్టీ ఆవిర్భావ సదస్సు ఏర్పాట్లపైన కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించినట్లుగా సమాచారం. జగన్‌ను, విజయమ్మను భారీ ఆధిక్యంతో గెలిపించి వైయస్ కుటుంబం ఆధిక్యాన్ని నిలబెట్టాలనే నిర్ణయానికి వారు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో వైయస్ మనోహర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వీరిని ఒక్కొక్కరిని ఒక్కో మండలానికి ఇన్‌ఛార్జ్‌గా నియమించి జగన్‌ను గెలిపించాలని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications