తెలంగాణ కోసం మంత్రుల ఇళ్లు ముట్టడి, నిజామాబాద్‌లో లాఠీఛార్జ్

తెలంగాణవాదులు మహేశ్వరంలోని హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు వారి ముట్టడిని అడ్డుకొని వారిని అరెస్టు చేశారు. ఉప్పల్ శాసనసభ్యుడు బండారు రాజిరెడ్డి ఇంటి వద్ద తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో మంత్రి సుదర్శన్ రెడ్డి ఇంటిముందు ఎబివిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వెంటనే చెల్లించాలంటూ ఎబివిపి కార్యకర్తలు మంత్రిని డిమాండ్ చేశారు. పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.












Click it and Unblock the Notifications