H1B Visa ఫీజు విషయంలో తగ్గేదే లేదు: రెండు లక్షలకు పైగా దరఖాస్తులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల వన్‌ టైమ్ H-1B వీసా ఫీజు వ్యవహారం భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే నిపుణులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ అధిక ఛార్జీని చెల్లించడానికి ఇష్టపడక అనేక మధ్యస్థాయి కంపెనీలు, కన్సల్టెన్సీలు తమ ఉద్యోగ ఆఫర్‌లను రద్దు చేసుకుంటున్నాయి. మరికొన్ని సంస్థలు స్టార్ట్ డేట్‌లను వాయిదా వేస్తున్నాయి. మరికొన్ని విదేశీ నియామకాలను పూర్తిగా నిలిపివేస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లోనూ వీటికి ఆదరణ మాత్రం తగ్గట్లేదు. హెచ్1 బీ వీసాలకు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి మార్క్‌వేన్ ముల్లిన్ సెనేట్ ప్యానెల్‌కు అందజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో ఉద్యోగాల కోసం రెండు లక్షలకు పైగా H1-B వీసా దరఖాస్తుదారులు దాఖలయ్యాయని తెలిపారు. ప్రాసెస్ వేగవంతం చేయడానికి 1,00,000 డాలర్లు చెల్లించారని ఆయన పేర్కొన్నారు.

Over 200000 Applicants Invested 100K Dollar Each Expedited H1B Visa Process in FY 2026 says Mullin

క్యాపిటల్ హిల్‌లో జూన్ 2న జరిగిన డీహెచ్‌ఎస్ 2027 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సెనేట్ అప్రోప్రియేషన్స్ సబ్‌కమిటీ సమావేశంలో ముల్లిన్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,86,000 లక్షల హెచ్-1బీ దరఖాస్తులను స్వీకరించామని అన్నారు. అమెరికాలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత ఉండకపోవచ్చని, సెనేటర్ సుసాన్ కాలిన్స్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

లక్ష డాలర్ల ఫీజును చెల్లించడం వల్ల హెచ్ 1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ వేగవంతమౌతుందని, ఈ మొత్తాన్ని చెల్లించిన 15 రోజుల్లోనే ప్రాసెస్ పూర్తి అవుతుందని ముల్లిన్ వివరించారు. దీనికి భిన్నంగా సాధారణ దరఖాస్తులకు మాత్రం దాదాపు ఏడున్నర నెలల సుదీర్ఘ సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ సబ్ కమిటీ సమావేశం సందర్భంగా సెనేటర్ కాలిన్స్ మాట్లాడారు. గ్రామీణ ఆరోగ్య విషయంపై ఆందోళన వ్యక్తం చేవారు. హెచ్1బీ వీసా ఫీజు పెంపు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే డాక్టర్ల కొరత తలెత్తే అవకాశం ఉందని అన్నారు.

దీనికి ముల్లిన్ బదులిస్తూ.. నార్త్ మైనేలోని ప్రెస్క్ ఐల్‌లోని ఓ ఆసుపత్రి ఇటీవల విదేశీ సర్జన్‌ను నియమించుకోవడానికి అవసరమైన ఫీజులను చెల్లిస్తూ వీసా దరఖాస్తులు దాఖలయ్యాయని తెలిపారు. నిపుణుల కొరత ఉన్న ప్రాంతాల్లోని డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్ల నియామకాల్లో దేశీయంగా తగినంత మంది నిపుణులు లభించే రంగాలను వేరుగా చూడాలని, ఈ విషయంలో ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియను సరళం చేయాలని కాలిన్స్ సూచించారు. ఈ ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.

దీనిపై సాధ్యమైన పరిష్కారాలను కనుగొంటామని ముల్లిన్ పేర్కొన్నారు. అలాస్కా రిపబ్లికన్ సెనేటర్ లిసా ముర్కోవ్స్కీ కూడా గ్రామీణ జిల్లాల్లో టీచర్ల కొరత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కోసం హెచ్-1బి వీసాలకు సంబంధించి తాను గతంలో లేవనెత్తిన సమస్యపై చర్చించాల్సి ఉందని ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+