వదిన వైయస్ విజయలక్ష్మిపై వైయస్ వివేకానంద పోటీ ఖరారు

YS Vivekananda Reddy
న్యూఢిల్లీ: పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి, తన వదని వైయస్ విజయలక్ష్మిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి పోటీ ఖరారైనట్లే కనిపిస్తోంది. వివేకానంద రెడ్డి బుధవారం చేసిన ప్రకటన ఆ విషయాన్ని తెలియజేస్తోంది. పులివెందుల కాంగ్రెసు అభ్యర్థిని తానే అని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలో తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పోటీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారని, అయితే తుది నిర్ణయం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని ఆయన అన్నారు.

గతంలో సోనియా గాంధీ చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిపై ఎవరు మాట్లాడినా తాను సహించబోనని ఆయన హెచ్చరించారు. పులివెందుల శానససభ నియోజకవర్గంలో, కడప పార్లమెంటు సీటులో లబ్ధి పొందడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. సోనియా గాంధీని కలవడానికి ఆయన ఢిల్లీ వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+