హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దురదృష్టకరం, సమైక్యవాదం అన్న మా పరిస్థితి ఏంటి: చిరంజీవి, అక్బరుద్దీన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై దాడి, గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరమని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి గురువారం అన్నారు. ప్రజాప్రతినిధుల తీరు శృతి మించిందని చెప్పారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రబుత్వాన్ని కోరారు. ప్రజా ప్రతినిధులకే రక్షణ లేనప్పుడు ఇక మాములు ప్రజల సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. జెపిపై దాడిని అడ్డుకున్న శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావుపైన దాడి చేయడం సమంజసం కాదన్నారు. పాలడుగు పెద్ద వ్యక్తి అని, అలాంటి పెద్ద వ్యక్తిపై దాడి చేయడం సరికాదన్నారు. దాడి సిగ్గుపడాల్సిన విషయం అన్నారు.

మనది ప్రజాస్వామ్య దేశమని, మన దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛంగా మాట్లాడే హక్కు ఉన్నదన్నారు. వారి వారి అభిప్రాయాలు ఎవరైనా చెప్పుకోవచ్చన్నారు. దాడి మాత్రం సరికాదన్నారు. కాగా సమైక్యవాదానికి మద్దతు పలుకుతున్న తమ పరిస్థితి ఏమిటని మజ్లిస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. మేం సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నామని మరి మాపై దాడి జరిగితే ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
Chiranjeevi accused TRS attack on Lok Satta MLA Jayaprakash Narayana today. Chiru said its very unfortunate, PRP is condemning the attack. MLA Akbaruddin made agitated about MIM leaders situation for United Andhra slogan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X