వారి విషయంలో జాగ్రత్త - జగన్ కు బైరెడ్డి కీలక సూచన..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పాలన పూర్తి చేసుకుంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇటు వైసీపీ సైతం ప్రభుత్వం పైన నిరసనలు మొదలు పెట్టింది. ఈ సమయంలో నే మాజీ సీఎం జగన్ కు వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి కీలక సూచనలు చేసారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
కర్నూలు జిల్లాకు చెందిన యువ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కూటమి రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ వైసీపీ వెన్నుపోటు పేరుతో నిరసనలకు దిగారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ వైసీపీ నిరసనలకు దిగింది. అయితే, ఇంకా కొందరు నేతలు పూర్తి స్థాయిలో రాజకీయంగా యాక్టివ్ కాలేదనే చర్చ వైసీపీలో వినిపిస్తోంది. ఇదే అంశం పైన బైరెడ్డి సిద్దార్ధరెడ్డి వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. పార్టీలో ఇప్పుడు డబుల్ గేమ్ ఆడుతున్న నేతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొందరు వ్యాపార పరమైన ప్రయోజనాలు కోసం ఇతర పార్టీలతో కుమ్మక్కు అవుతున్నారని చెప్పుకొచ్చారు. వీరు ఎన్నికల సమయం వచ్చినప్పుడు పార్టీ వైపు చూస్తారని.. తాము వైఎస్ కుటుంబానికి సన్నిహితులం అంటూ ముందుకు వస్తారని చెప్పుకొచ్చారు. అలాంటి వారిని గుర్తించి దూరం పెట్టాలని సూచించారు.

బైరెడ్డి వ్యాఖ్యల పై పార్టీలో చర్చ
కాగా, పార్టీ కష్టాల్లో ఉన్ని సమయంలో ఎవరు పని చేస్తున్నారో గుర్తించాలని బైరెడ్డి పేర్కొన్నారు. పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో గుర్తించి వారికే పెద్ద పీట వేయాలని సూచించారు. ఇక.. బైరెడ్డి చేసిన సూచనల పైన పార్టీలో చర్చ సాగుతోంది. రెండేళ్ల నిరసనల వేళ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపట్టింది. ఈ సారి అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసనలు జరిగాలి అని జగన్ తేల్చి చెప్పరు. ఇప్పటి వరకు పార్టీ పిలుపునిచ్చిన నిరసనలకు కొంత మంది సీనియర్ నేతలు దూరంగా ఉంటున్నారు. దీని పైన జగన్ తాజాగా జరిగిన సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రతీ చోట పార్టీ పోటీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. కాగా.. ఇప్పుడు బైరెడ్డి చేసిన వ్యాఖ్యల పైనా పార్టీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది.













Click it and Unblock the Notifications