Sapthagiri Express :సప్తగిరి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్..! ఈ తేదీల్లో..!
దక్షిణ రైల్వే పరిధిలోకి వచ్చే తిరుపతి-చెన్నై సెక్షన్లో ప్రయాణికులకు అధికారులు ఓ అలర్ట్ జారీ చేశారు. అరక్కోణం యార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణించే పలు సప్తగిరి ఎక్స్ ప్రెస్ (sapthagiri express) రైళ్లను వివిధ తేదీల్లో రద్దు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేశారు. కాబట్టి ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులు వీటిని గమనించాల్సి ఉంటుంది.
ఎంజీఆర్ చెన్నైసెంట్రల్ నుంచి తిరుపతికి వెళ్లే సప్తగిరి ఎక్స్ ప్రెస్ రైలు (16057)ను ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేశారు. అలాగే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి వెళ్లే సప్తగిరి ఎక్స్ ప్రెస్ (16053) రైలును కూడా ఇవే తేదీల్లో రద్దు చేసారు. అలాగే ఇవే స్టేషన్ల మధ్య నడిచే సప్తగిరి ఎక్స్ ప్రెస్ (16203) రైలును ఈ నెల 26న రద్దు చేశారు. అలాగే తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్ కు వెళ్లే సప్తగిరి ఎక్స్ ప్రెస్ రైలు (16054)ను కూడా ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేశారు.

దీంతో పాటు తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్ కు వెళ్లే మరో సప్తగిరి ఎక్స్ ప్రెస్ రైలు (16058)ను కూడా ఈ నెల 26, 28 తేదీల్లో రద్దు చేశారు. అలాగే తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్ కు ప్రయాణించే మరో సప్తగిరి ఎక్స్ ప్రెస్ (16204)ను కూడా ఈ నెల 26న రద్దు చేశారు. అరక్కోణం జంక్షన్ పరిధిలో జరుగుతున్న సంస్థాగత మార్పుల కారణంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. చెన్నై-అరక్కోణం సెక్షన్ లో ట్రాక్ ల సామర్ధ్యం పెంపు సహా ఇతర కారణాల వల్ల ఈ మార్పులు జరుగుతున్నాయి.














Click it and Unblock the Notifications