హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ దృశ్యాల లీకేజీ దుమారం, పథకం ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి పనే

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: శాసనసభలో గురువారంనాడు గవర్నర్ నరసింహన్ ప్రసంగం సందర్భంగా జరిగిన గొడవకు సంబంధించిన వీడియో క్లిప్పింగుల లీకేజీపై దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్షాలను దెబ్బ తీయడానికి ఒక పథకం ప్రకారమే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచన మేరకు శాసనసభ ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ కార్యాలయం నుంచి అవి లీకయినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వీడియో దృశ్యాలను కాకుండా ఎడిట్ చేసిన దృశ్యాలతో వీడియో ఫుటేజ్‌లను అందించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి, ప్రతిపక్షాల తప్పును ఎత్తి చూపే విధంగా ఆ వీడియో ఫుటేజ్‌లను విడుదల చేసినట్లు ప్రతపక్షాలు విమర్శిస్తున్నాయి.

గవర్నర్ ప్రసంగం సందర్భంగా గురువారం ఉదయం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి శాసనసభ్యులు ప్రయత్నించారు. మైకులు విసిరేశారు. ప్రసంగ ప్రతులు చించి విసిరేశారు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలను తొలగించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా వాటిని ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన టీవీ చానెళ్లకు అందించినట్లు, కొన్ని చానెళ్లకు నిరాకరించినట్లు చెబుతున్నారు. లీకేజీ వ్యవహారంలో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను పావుగా వాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

English summary
Assembly procedings video footage leakage issue is rocking in poliytical circle. Opposition is blaming CM Kiran kuamar Reddy for this leakage. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X