టిఆర్ఎస్‌పై డిప్యూటీ స్పీకర్‌కు, పోలీసు కమిషనర్‌కు జెపి ఫిర్యాదు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు తమపై దాడి చేసినట్లు లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ గురువారం డిప్యూటీ స్పీకరు నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేశారు. మీడియా పాయింట్ వద్ద తనపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేసిన వెంటనే ఆయన నేరుగా స్పీకరు కార్యాలయానికి వెళ్లి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసు కమిషనర్‌కు పోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. జెపితో పాటు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు కూడా పిర్యాదు చేశారు.
జెపికి తనకు ఫిర్యాదు చేసిన వెంటనే డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల వైద్యుడిని పిలిపించి పరీక్షలు చేశారు. కాగా డిప్యూటీ స్పీకరు ఫిర్యాదు చేస్తే కేసును నమోదు చేస్తామని డిసిపి అకున్ సబర్వాల్ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, మంత్రులు, పలువురు శాసనసభ్యులు జెపిని పరామర్శించారు.
Lok Satta President, Kukatpally MLA Jayaprakash Narayana complained against TRS MLAs today to Deputy Speaker Nadendla Manohar and also Police Commissioner.
Story first published: Thursday, February 17, 2011, 12:52 [IST]