హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి: అసెంబ్లీలో సభ్యుల తీరుపై జెపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ శాసనసభ్యుల తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన శాసనసభలోని మీడియా పాయింట్ వద్ద గురువారం మాట్లాడారు. ఉభయ సభలు జరిగిన తీరు చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇదే తీరుగా ఉంటే శాసనసభను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడమే మేలు అని ఆయన అన్నారు. స్వాతంత్ర సమరం అమరవీరులకు తాను క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు.

చట్టబద్ధ పాలన చేసే శక్తి మనకు లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ లేదు, చట్టబద్ద పాలన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేసినవారే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. చెడ్డవాళ్ల దుర్మార్గం కన్నా మంచి వాళ్ల మౌనం ప్రమాదకరమని ఆయన అన్నారు. జెపి మీడియాతో మాట్లాడుతున్నంత సేపు ఉద్విగ్నత చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు ఆయనను అడ్డుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

English summary
Loksatta MLA Jayaprakash Narayana deplored the behavior of Telangana MLAs in Assembly. JP criticised that Constitutional violation is took place. He terms as a black day today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X