ప్రజల మనోభావాలు తెలియజేయడానికే ఢిల్లీకి: చీప్ విప్ మల్లుభట్టి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ప్రజల సొమ్ముతో నడపబడుతున్న శాసనసభను సక్రమంగా నడిపించడానికి విపక్షాలు సహకరించాలని ప్రభుత్వ చీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో సహాయ నిరాకరణకు పిలుపు నిచ్చిన ఉద్యోగ సంఘాలు సైతం విరమించుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని చెప్పారు. ప్రజా సమస్యల ప్రస్తావనకు, వాటి పరిష్కారానికి అసెంబ్లీయే వేదిక అన్నారు. అలాంటి వేదికను ఉపయోగించుకొని ప్రజలకు మేలు చేయాలని సూచించారు. బడ్జెట్ సమావేశాలు అతి ముఖ్యమైనవని, అలాంటి సమావేశాలు గందరగోళం చేయడం సరికాదన్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ప్రాంత ప్రజల మనోభావాలను కేంద్రానికి తెలియజేయటం కోసమే న్యూఢిల్లీ వెళ్లారన్నారు. అయితే వారు న్యూఢిల్లీ నుండి తిరిగి వచ్చి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిష్కరిస్తున్నట్లు నేను అనుకోవడం లేదని చెప్పారు. సమావేశాలకు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
Government Chief Whip Mallubhatti Vikramarka said that Telangana Congress MLAs and MLCs will participate in thursday budget session. He said Congress leaders will not obstruct Governor speech. He also urged opposition to support session be run smoothly.
Story first published: Thursday, February 17, 2011, 12:33 [IST]