ఆటవిక రాజ్యం కాదు, దాడులు ఎవరు చేసినా ఖండించాలి: రేవంత్ రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: మనది ఆటవిక రాజ్యం కాదని ప్రజాస్వామ్య దేశం అని అందుకే ఎవరు దాడులకు పాల్పడినా ఖండించాల్సిన అవసరం ఉందని, భౌతిక దాడులకు ఎవరూ పాల్పడ్డా అది క్షమార్హం కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం ఓ టీవీ కార్యక్రమంలో అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాగం జనార్ధన్ రెడ్డి, హన్మంతు షిండే, సీతక్కపైన ఇప్పుడు లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ దాడులు చేయడం అమానుషమన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా పోరాడ వచ్చునని, అయితే దాడులు మాత్రం ఎవరు చేసిన క్షమార్హం కాదన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులపైన, శాసనసభ్యులపైన పోలీసులతో దాడి చేసిన ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రాన్ని పారామిలిటరీ దళాలతో నింపే దిశలో ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. గవర్నర్ నరసింహన్ ఓ మాజీ పోలీసు అధికారి అని అలాంటి వారని గవర్నర్‌గా కేవలం తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి నియమించిందని అన్నారు. టిడిపి ఎవరీపైనా దాడులు చేయదని ప్రజాస్వామ్యయుతంగా మాత్రమే నిరసనలు తెలియజేస్తుందని చెప్పారు. దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు.
TDP senior leader, MLA Revanth Reddy condemned TRS attack on Jayaprakash Narayana today. He accused governor speech without Telangana. He said we are in democracy.
Story first published: Thursday, February 17, 2011, 13:34 [IST]