హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్‌పై ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి, సోనియా గూఢచారిగా అభివర్ణణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ గవర్నర్ నరసింహన్‌పై శాసనసభ నుంచి వారం రోజుల పాటు సస్పెన్షన్‌కు గురైన తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. నైతిక విలువలు ఏమైనా ఉంటే నరసింహన్ పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నరసింహన్ గవర్నర్‌గా కొనసాగడానికి అనర్హుడని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నరసింహన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి గూఢచారి వ్యవస్థగా పనిచేస్తున్నారని, ఏ హోదాలో సోనియాను గవర్నర్ కలుస్తారని ఆయన అన్నారు. గవర్నర్ తెలంగాణ వ్యతిరేకి అని ఆయన అన్నారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన స్పీకర్‌పై తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. తనను అసెంబ్లీ నుంచి ఏడు రోజుల పాటు సస్పెండ్ చేయవచ్చు గానీ తాను తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నానని, కాంగ్రెసు పార్టీ ఏడు దశాబ్దాల పాటు ప్రజలకు దూరమవుతుందని ఆయన అన్నారు.

ఈ రాష్ట్రంలో పోలీసు అధికారిగా పనిచేసిన నరసింహన్‌ను ఇదే రాష్ట్రానికి ఎలా గవర్నర్‌గా వేస్తారని ఆయన అడిగారు. గవర్నర్ తెలంగాణ వ్యతిరేకి అని ఆయన అన్నారు. నరసింహన్ పదవికి రాజీనామా చేయాలని, లేదంటే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కుర్చీ కింద పడితే గవర్నర్ బాధపడుతున్నారని, శాసనసభ్యులను గవర్నర్ పోలీసులతో కొట్టించారని, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తమపై పోలీసు దాడులు చేయించారని, శానససభ్యులుగా తమకు హక్కుల ఉండవా, తమ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌కు లేదా అని ఆయన అన్నారు. స్పీకర్ తమ హక్కులను కాలరాశారని, ప్రజలే కాంగ్రెసు పార్టీకి గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. స్పీకర్ ప్రవర్తనపై శాసనసభలో చర్చ జరగాలని ఆయన అన్నారు.

రంగరాజన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయన ముఖంపై పుస్తకం విసిరి కొట్టిన సంఘటనలు జరిగాయని, అంతకన్నా మించి తమ సభ్యులు గవర్నర్ ప్రసంగం సందర్భంగా వ్యవహరించలేదని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గవర్నర్ తెలంగాణ వ్యతిరేకి అని ఆయన విమర్శించారు. తెలంగాణ గొంత నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. తాము తెలంగాణ కోసం పోరాటం చేస్తామని ఆయన అన్నారు. సభ్యుల సస్పెన్షన్ విషయంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు.

English summary
Suspended TDP MLA from assembly Revanth Reddy lashed at Governor Narasimhan. He demanded governor to resign. He termed Narasimhan as anti Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X