చిరంజీవి సామాజిక న్యాయంపై వైయస్ జగన్ కామెంట్స్

పేదలను వారి మానానికి వారిని వదిలేస్తున్న ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తమపై లేదని ఆయన అన్నారు. ఫీజుల రీయంబర్స్‌మెంట్ చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నానని ఆయన అన్నారు. హెచ్చరిక జారీ చేస్తున్నాననే వ్యాక్యాన్ని ఆయన రెట్టించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ కింద 3400 కోట్ల రూపాయలు చెల్చించాల్సి ఉండగా వేయి కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, అది ముష్టి వేయడమేనని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం అయిపోవస్తోందని, మళ్లీ బడ్జెట్ పెట్టబోతున్నారని, మళ్లీ బడ్జెట్‌లో 3400 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటుందని, 2000 వేల కోట్ల బకాయిలతో పాటు 3400 కోట్ల రూపాయల ఎలా విడుదల చేస్తారని ఆయన అన్నారు. దీన్నిబట్టి చూస్తే పథకాన్ని నాశనం చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని అనిపిస్తోందని ఆయన అన్నారు.
ఈ ప్రభుత్వానికి బంగళాఖాతంలో పడే స్థాయి కూడా లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా లేదని, ప్రభుత్వాన్ని వేస్తే బంగాళాఖాతం కూడా కలుషితం అవుతుందని ఆయన అన్నారు. విద్యార్థులను ఆదుకోవడానికే తాను వారం రోజుల పాటు దీక్షను కొనసాగిస్తున్నానని, అలాగైనా ప్రభుత్వం స్పందిస్తుందేమోనని అనుకుంటున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications