జగన్‌కు 222 సీట్లు, చంద్రబాబు సిఎం కారు: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్

Nallapureddy Prasanna Kumar Reddy
హైదరాబాద్: ఎన్నికలు వస్తే మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 222 సీట్లు గెలుచుకుంటారని తెలుగుదేశం పార్టీ అసమ్మతి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శుక్రవారం విలేకరులతో అన్నారు. జగన్ ఇందిరాపార్కు వద్ద చేస్తున్న ఫీజు పోరు దీక్షకు ఆయన వచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు వస్తే 150 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందని అంటున్నారని, కానీ అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించకుంటే కూప్పకూలుతుందన్నారు. ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటమాడవద్దని హెచ్చరించారు.

విద్యార్థులతో ఆడుకోవాలని చూస్తే ప్రభుత్వం నిలబడదన్నారు. ప్రజల ఆశీర్వాదం జగన్‌కు ఉన్నదన్నారు. ప్రభుత్వం ఇలాగే చేస్తే రాష్ట్రపతి పాలన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. జగన్ వర్గం దేనికైనా సిద్ధం ఉందననారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రికి రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. 2004లో, 2009లో దెబ్బతిన్న చంద్రబాబుకు ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవన్నారు. ప్రజలు చంద్రబాబు మాట నమ్మే స్థితిలో కూడా లేరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+