జగన్‌, కెవిపిలతో చంద్రబాబు మిలాఖత్: టిఆర్ఎస్ ఆరోపణ

Ys Jagan and Chandra Babu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సవాల్ విసరడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తోకముడిచాడని ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టిఆర్ఎస్‌కు ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవన్నారు. చంద్రబాబు ఆరోపణలు అవాస్తవమన్నారు. అధికారం దూరం అయిందని చంద్రబాబు మతిభ్రమించి పోయి అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్, కెవిపితో చంద్రబాబు మిలాఖత్ అయి తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో రోజుల తరబడి అసెంబ్లీ సభ వృథా అయితే మాట్లాడని చంద్రబాబు తెలంగాణ బిల్లు కోసం కేవలం మూడు రోజులు వృథా అయితేనే ఆవేదన వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ కాంగ్రెస్ బ్రాంచ్ ఆఫీసు అని చంద్రబాబు అన్నాడని, అయితే కెసిఆర్ అవిశ్వాస తీర్మానం సవాల్ విసరడంతో తోకముడిచాడని అన్నారు. జగన్‌తోనో, కాంగ్రెస్‌తోనే మిలాకత్ కావాల్సిన అవసరం మాకు లేదన్నారు. అసలు తెలంగాణపై ఏం చేయాలో మొదట చంద్రబాబు నిర్ణయించుకోవాలని సూచించారు. పార్టీ నేతలు తెలంగాణ నేతలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతుంటే వ్యక్తిగత అభిప్రాయమంటున్నారని, ఇప్పటికైనా తెలంగాణ టిడిపి నేతలు బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఆయనకు విద్యార్థుల ప్రాణం, ప్రజల ఆకాంక్ష కంటే పార్టీయే ముఖ్యమైందన్నారు. తీర్మానానికి కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నిస్తే పరిస్థితులు మారాయని అనటం ఏమిటన్నారు. రేపటి 48 గంటల బంద్ ను ఇదే స్ఫూర్తితో బుధవారం ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+