కిరణ్ ప్రభుత్వానికి సిగ్గు లేదు: జగన్ వర్గం పుల్లా పద్మావతి

శాసనమండలిలో సంక్షేమ పథకాలపై కేవలం కొండా మురళీదరరావు, జూపూడి ప్రభాకరరావు, తాను మాత్రమే ప్రశ్నిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై జగన్ దీక్షకు మద్దతుగా రేపు బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీని స్తంభింప జేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ దీక్ష ఎందుకు చేస్తున్నారో విద్యార్థులు గుర్తించారని కానీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు గుర్తించక పోవడం దురదృష్టకరమన్నారు. మేమొక్కరం బావుంటే చాలు, రాష్ట్ర ప్రజలు ఏమైతే ఏమిటనే ధోరణిలో ప్రభుత్వం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై శాశ్వత పరిష్కారం కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా జగన్ దీక్ష చేస్తున్నారని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అంతకుముందు అన్నారు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేకే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications