48 గంటల తెలంగాణ బంద్ ప్రారంభం, ఎక్కడి బస్సులు అక్కడే

వరంగల్ జిల్లా నర్సంపేటలో బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం పసలవాది గ్రామంలో రెండు ప్రైవేటు బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌లో సెట్విన్ బస్సును ధ్వంసం చేశారు. రాణిగంజ్ ఆర్టీసీ డిపో ముందు తెలంగాణ ఆర్టీసీ ఐకాస నాయకులు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూత పడ్డాయి. పెట్రోలు బంకులు పని చేయడం లేదు. కరీంనగర్ డిపో వద్ద తెలంగాణవాదులు బైఠాయించారు.












Click it and Unblock the Notifications