ఖమ్మం జిల్లా రైల్ రోకోలో మహిళా నేత పట్ల సిఐ అసభ్య ప్రవర్తన

శిరీష చేయి పట్టుకుని వెంకటరావు బయటకు లాక్కెళ్తున్న దృశ్యాలను టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. శిరీష్ వెంకటరావుతో వివాదానికి దిగారు. పట్టాలపై నుంచి వెనక్కి రావడానికి ఆమె నిరాకరించారు. దీంతో ఆయన ఆమెను చేయి వేసి లాక్కెళ్లారు. అయితే, ఇందులో తనకు దురద్దేశం లేదని, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో తాను బయటకు లాగాల్సిన అనివార్యతలో చిక్కుకున్నానని ఆయన వివరణ ఇచ్చారు. శిరీష తనపై చేయి చేసుకున్నట్లు కూడా ఆయన చెప్పారు. అయితే, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పెనుగులాడినట్లు శిరీష చెబుతోంది.












Click it and Unblock the Notifications