హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ దూకుడు, చంద్రబాబు కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, ఆ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డికి మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణపై నాగం జనార్దన్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతుండడం ఆయనకు నచ్చడం లేదని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులతో కలిసి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకునే పాత్రకు నాగం జనార్దన్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. తెలంగాణపై అంత దూకుడుగా వెళ్లడం చంద్రబాబుకు ఇష్టం లేదని అంటున్నారు. అయినా, ఏమీ అనలేకపోతున్నారని సమాచారం. శాసనసభలో తాను చెప్పినట్లే వినాలని చంద్రబాబు ఎంతగా చెప్పినా నాగం జనార్దన్ రెడ్డి వినడం లేదని చెబుతున్నారు.

కాగా, నాగం జనార్దన్ రెడ్డి గత కొంత కాలంగా చంద్రబాబు చేంబర్ కూడా వెళ్లడం లేదని చెబుతున్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశాలకు కూడా ఆయన చాలా వరకు దూరంగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎప్పుడో ఒక్కసారి అలా వెళ్లినట్లు అనిపించుకుంటున్నారని, తెలంగాణపై స్వతంత్రంగా కార్యాచరణను రూపొందిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ జెఎసి ఉద్యమ కార్యాచరణకు కూడా చంద్రబాబును అడగకుండానే ఆయన మద్దతు ప్రకటిస్తున్నారని, మిగతా తెలంగాణ నాయకులు అనుసరించక తప్పని పరిస్థితి వస్తోందని అంటున్నారు. అనుసరించకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతామనే ఆందోళన వారిని ముందుకు నడిపిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
It is said that gap between Chandrababu and party telangana forum convener N janardhan reddy is widening. According to sources Janardhan Reddy is not hearing Chandrababu's suggestions and acting on his own on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X