హైదరాబాద్: దేవాదాయ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం పట్ల మాజీ మంత్రి, అనంతపురం జిల్లా శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి గురువారం స్పందించారు. జూపల్లి తాను రాజీనామా చేశానని ఒకవైపు చెబుతూనే మరోవైపు తన విధులకు హాజరవుతానని చెబుతున్నారని అన్నారు. రాజీనామా అని ప్రకటించిన అనంతరం విధులకు హాజరు కావడాన్ని రాజీనామా చేసినట్లుగా భావించాలా అని ప్రశ్నించారు. అలా చేస్తే రాజీనామా అవుతుందా అన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖను రాశానని చెబుతున్నారని, దానిని చదివిన అనంతరం అవసరం అయితే మాట్లాడుతానని చెప్పారు.
Ex Minister JC Diwakar Reddy questioned today Minister Jupalli Krishna Rao on his resignation. He condemned Jupalli comments. He said I will respond on his resignation after read it.