ఎంపీ కావూరి వ్యాఖ్యల ఎఫెక్ట్: మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా

జూపల్లి రాజీనామాపై ముఖ్యమంత్రి స్పందించారు. ఇలా రాజీనామాలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి జూపల్లిని కోరినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున ఇక్కడ రాజీనామాలు చేస్తే సరికాదని హితబోధ చేసినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ జూపల్లి సిఎం మాటలు బేఖాతరు చేసినట్టుగా తెలుస్తోంది. కాగా మంత్రి జూపల్లి రాజీనామా ఇతర మంత్రులకు, ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురి చేయనుంది. కావూరి వ్యాఖ్యలకు స్పందించిన రాజీనామాస్త్రం ప్రయోగించిన జూపూడి బాటలో మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లకుంటే తెలంగాణవాదులు వారిపై ఒత్తిడి తెచ్చే అవకాశముంది. తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల దృష్ట్యా జూపల్లి వెనక్కు తగ్గవచ్చని తెలుస్తోంది.
కావూరి సాంబశివ రావు వ్యాఖ్యలకు సవాల్‌గానే తాను రాజీనామా చేసినట్లు జూపల్లి కృష్ణా రావు చెప్పారు. తెలంగాణను సాధించడానికి తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications